ఉద్యోగ పరస్పర సహకార సంఘం అధ్యక్షులుగా తాళ్ల చంద్రయ్య
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు) :
ఆత్మకూరు ఉద్యోగ పరస్పర సహకార సంఘం ఎన్నికలు ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉద్యోగులసర్వసభ్య సమావేశంలో నూతన సంఘం అధ్యక్షులుగా తాళ్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా కందకట్ల కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా గుర్రం ప్రభాకర్, కోశాధికారిగా మండ ఆనందం, సంఘం ఆడిటర్, గా జున్నుతుల ఆది రెడ్డి, లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు తాళ్ల చంద్రయ్య ప్రధాన కార్యదర్శికందగ ట్ల కుమారస్వామి లు మాట్లాడుతూ ఉద్యోగులపరస్పర సహకార సంఘంఅభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సంఘం సభ్యుల సమన్వయానికి కృషి చేస్తూ సభ్యుల సంక్షేమానికి పాటుపడతామన్నారు ఎన్నికల్లో తమను ఎన్నుకున్న సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
