వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి
ఎమ్మెల్యేకి ఘన సన్మానం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయోధ్య లో కరసేవ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు పిఎస్ సిఎస్ చైర్మన్ ఏర్కొండ రవీందర్ గౌడ్, వార్డు సభ్యులు బైగాని రాజేందర్, పరికరాల సుగ్రీవులను భజన మండలి ఆలయ ఉత్సవ సమితి నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు మాజీ జెడ్పిటిసి టింగిలికారు సత్యనారాయణ ఆత్మకూరు జెడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు శివాలయం కమిటీ అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి, వంగాల సత్యనారాయణ రెడ్డి మునికుంట్ల సతీష్, పరికరాల వాసు మాజీ సర్పంచ్ పలకల మంజుల కాంగ్రెస్ నాయకులు బయ్యా తిరుపతి తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
