Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కరీమాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

జై భారత్ వాయిస్
బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకున్న భారతదేశాన్ని వారి నుండి విముక్తి కల్పించడానికి ఆజాద్ హింద్ పౌజ్ సంస్థను స్థాపించి వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన సుభాష్ చంద్రబోస్ యొక్క ధైర్య సాహసాలను మర్చిపోలేమని గ్రేటర్ వరంగల్ నగరంలోని 40 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఉర్సు సిఆర్సీసి భవన్ లో నేతాజీ విగ్రహానికి కార్పొరేటర్ మరుపల్ల రవి పూలదండ వేసినారు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అహింస మార్గంలో వెళితే స్వాతంత్రం సాధించిలేమని ఆయుధాలు చేత పట్టి ఆంగ్లేయులను తరిమికొడదామని భావించి సైనిక దళం ఏర్పాటు చేయడం వలననే మన దేశానికి ఆంగ్ల పాలకుల నుండి విముక్తి లభించడం వలన స్వాతంత్ర సిద్ధించిందని మరుపల్ల రవి అన్నారు ఈ జయంతి వేడుకలలో నర్మేట కుమారస్వామి, వనం కుమార్, మరుపల్ల గౌతమ్, అశోక్, వంగరి సురేష్, కొలుపుల చంద్రకళ, వహీదా అస్మా, సమీనా, చీర రమేష్, సతీష్, ఆర్పిలు హిమబిందు, సంధ్య, రాధిక, కవిత, స్రవంతి, శ్రీలత, శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థునులు ఉన్నారు

Related posts

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!

ప్రజాకవి కాళోజి నారాయణరావుకు ఘన నివాళి*

Sambasivarao

జూన్ 3 నుండి 13వరకు పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు