Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేడుకలు

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నబావిలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలనందు సుభాష్ చంద్రబోస్ 127వ,జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ నేతాజీ సుభాస్ చంద్రబోస్ జనవరి 23 1897 న జన్మించాడని భారత స్వాతంత్ర సమరయోధుడని సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడని అన్నారు.ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని కానీ మరణం 1945 ఆగస్ట్ 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. గాంధీ యొక్క అహింసా వాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన అని ఈ అభిప్రాయం తోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడని చంద్రబోస్ ను 11 సార్లు ఆంగ్లేయులు కారాగారంలో నిర్బంధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని విద్యార్థులు ప్రతి ఒక్కరూ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏటీపీ సురేష్,.డిప్యూటీ వార్డెన్ సుకుమార్,ఉపాధ్యాయులు సోమారాణి,ప్రభాకర్,సమత, కోటి,కిరణ్, బషీర్, రమేష్,కృష్ణమూర్తి, వీరేందర్, లక్ష్మణ్, సునీత,అనిత,సతీష్, ప్రేమలత,శేఖర్,నాన్ టీచింగ్ సిబ్బంది బాలకొమురెల్లి,వెంకన్న,ఉస్మాన్ , శేఖర్, నరేష్ ,రవీందర్, బుచ్చయ్య, రాధిక, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

చంద్రయ్యపల్లి లో సీతారాముల కళ్యాణమహోత్సవం

Jaibharath News

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

Jaibharath News