Jaibharathvoice.com | Telugu News App In Telangana
కర్నూలు

నేతాజి సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి

జై భాతత్ వాయిస్ డొన్
స్వాతంత్య్ర సమరయోధులునేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోడోన్ డిఎస్పి కార్యలయంలో సామాజిక కార్యకర్త. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ డిఎస్పి వై.శ్రీనివాసరెడ్డి అద్యక్షతన స్వాతంత్య్రసమరయోధులు నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నారు. మన దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డోన్ వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు,డోన్ డిఎస్పికార్యలయ సిబ్బంది పి సి యస్ సలీం, దస్తగిరి, అమర్ ,రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా డోన్ డిఎస్పీ .శ్రీనివాస రెడ్డి, సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫిలుమాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ డిఎస్పి వై.శ్రీనివాస రెడ్డి, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి లు కోరారు భారతమాత కన్నవీరులలో నేతాజీ గారు ఒకరు. ఈయన జన్మదినాన్ని “దేశ్ ప్రేమ్ దివస్ “గా జరుపుకుంటామని అన్నారు.

Related posts

పండుగలు సామాజిక బాధ్యతను గుర్తుచేసి, పురోభివృద్ధికి దోహదపడుతాయి