జై భారత్ వాయిస్ ఉరవకొండ
మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా కింద రూ. 25,571 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాం. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావులేకుండా పక్కాగా అమలు చేస్తున్నాం” అని సీఎం జగన్ అన్నారు.వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం జగన్ పాల్గొని బటన్ నొక్కి రూ. 6,394.83 కోట్ల నిధులను పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. “నాలుగేళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్‌ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్ధానాన్ని పూర్తి చేయబోతున్నానని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెప్పడానికి సంతోషపడుతున్నాను” అని సీఎం అన్నారు.నేడు విడుదల చేస్తున్న డబ్బు కలిపి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా ఈ 56 నెలల పాలనలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని సీఎంతెలిపారు. వివక్ష లేకుండా అందించామని గర్వంగా చెబుతున్నానని, ఇది కూడా ఒక రికార్డేనని, గతంలో ఎప్పుడు జరగలేదని, మీ బిడ్డ పాలనలోనే ఇది జరుగుతుందని స్ఫష్టం చేశారు.
previous post