Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారంలో అనిమీయ ముక్తి భారత్  కార్యక్రమం

గీసుకొండ జై భారత్ వాయిస్
ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అనిమీయ ముక్తి భారత్  కార్యక్రమం బుధవారం మధ్యహ్నం రెండుగంటకు వరంగల్ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ ప్రారంభించారు.  వివరాలకు వెళ్ళితే  గీసుకొండ మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరంగల్  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ అనిమీయ ముక్తి భారత్  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. . ఈ ఈ సదర్భంగా డిఎంహెచ్ఓ  మాట్లాడుతూ ,  జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం ద్వారా, రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమాన్ని RBSK   వైద్య అధికారులు సిబ్బందితో కలిసి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలోని  8వ తరగతి నుండి 12వ తరగతి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు రక్తహీనత నిర్మూలన కొరకు వీక్లీ ఐరన్ పోలిక్ టాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగిందని ,రక్తహీనకు సంబంధించిన HB శాతాన్ని తెలుసుకోవడం కొరకు HP డిజిటల్ మీటర్ ద్వారా తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.  పాఠశాల విద్యార్థులకు అనిమియా ముక్తభారత్, పోషకాహారం విలువల గురించి , మంచిఆరోగ్య సూత్రాల గురించి, వ్యక్తిగత  పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి, పిల్లలకు అవగాహన కల్పించాలని . పిల్లల యొక్క మానసిక స్థితి, రక్తహీనత నివారిస్తే పాఠశాలలకు వచ్చే హాజరు శాతాన్ని పెంచవచ్చని వైధ్యసిబ్బందికి సూచించారు  .  ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఎంహెచ్ఓలు డాక్టర్   ప్రకాష్ డాక్టర్  గోపాల్ రావు ,ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు నేహా, ప్రధానోపాధ్యాయుడు  సాంబయ్య, సిహెచ్ ఓ మధుసూదన్ రెడ్డి  ఆరోగ్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ జిల్లా నూతన కలెక్టర్గా సత్య శారదా దేవి

adupashiva

నర్సంపేటకు నర్సింగ్ కళాశాల మంజూరు

Sambasivarao

హర్జియా తండా లో వైద్య శిబిరం