Jaibharathvoice.com | Telugu News App In Telangana
కృష్ణా

రాష్ట్ర సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ

అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్
అమరావతి:25 జనవరి జై భారత్ వాయిస్
:ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రక్రియలో భాగంగా గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు ఆవరణలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రతిజ్ణ కార్యక్రమాన్నినిర్వహించారు.నియోజనుల్లో ఓటు హక్కు వినియోగం దాని ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.అంతేగాక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని భాహ్య ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఈజాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ పాల్గొని అధికారులు,సిబ్బందితో భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను,స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత,ప్రశాంత ఎన్నికల ఫ్రాభవాన్నినిలబెడతామని ,మతం,జాతి,కులం,వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ణ చేస్తున్నామని ఆయన అందరితో ప్రతిజ్ణ చేయించారు.ఈకార్యక్రమంలో జిఏడి అదనపు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు,రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు,డిప్యూటీ సెక్రటరీలు రామసుబ్బయ్య,శ్రీనివాస్,సుధాకర్ సహా జిఏడితో పాటు ఇతర విభాగాల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

నూకాలమ్మ అమ్మవారి సేవలో మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్

ఏపీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారు.‌

Jaibharath News

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం