నందిగామ జైభారత్ వాయిస్
నందిగామ మండలంలోని మునగచర్ల శివారు డూలాస్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు, వితంతువులకు, నిరుపేదలకు డూలాస్ ట్రస్ట్ వితరణతో అందజేసిన నూతన వస్త్రాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటి వారికి సహాయపడుతూ.. పేదలకు అండగా నిలుస్తూ డూలాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ట్రస్ట్ సేవలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డూలాస్ ట్రస్ట్ నిర్వాహకులు పగిడిపల్లి దేవసహయం, మణీ ఆనంద్ లను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
