ఆత్మకూరు మండల పంచాయతి అధికారికి ప్రశంసా పత్రం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),:
గత సంవత్సరం లో నేషనల్ పంచాయతి అవార్డుల లో ఆత్మకూరు మండలానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికంగా అవార్డులు రావడానికి కృషి చేసినందుకు గాను ఆత్మకూరు మండలం పంచాయతి అధికారి చేతన్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రశంస పత్రం శుక్ర వారం అందచేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగులు,అధికారులకు పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో ప్రశంస పత్రాలు అందజేశారు. మండలంలో నీ పలు గ్రామాల్లో ఉత్తమ పారిశుధ్య స్థితిని, సుపరిపాలన ను కొనసాగించడం స్వచ్చ సర్వేక్షన్ -2023 ఆత్మకూరు గ్రామం రాష్ట్ర స్థాయి లో ప్రథమ బహుమతి అందుకోవడం ఈ ప్రశంస పత్రం రావడానికి దోహదం చేసిందని ఎంపిఓ చేతన్ కుమార్ రెడ్డి తెలిపారు.