హనుమకొండ : జై భారత్ వాయిస్ ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖ అధికారులతో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పరీక్ష ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎ. గోపాల్ కలెక్టర్ కు వివరించారు. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఒకరోజు రెండు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని డిఐఈఓ గోపాల్, తెలిపారు.ఈ సమావేశంలో డిఆర్ఓ వై.వి గణేష్, సీఐ శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్ సింగ్, పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎన్పీడీసీఎల్ ఏడీఈ పి అశోక్, డివిజనల్ పంచాయతీ అధికారి బి సుదర్శన్, తది తరులు పాల్గొన్నారు.
previous post
next post