కుందుర్పి జై భారత్ న్యూస్ వాయిస్,,
ఉత్తమఅవార్డు పొందిన ఎస్సైకి ప్రజా ప్రతినిధులు ఘనసన్మానం. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపూర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పొందిన నూతన ఎస్ఐ టి,పి వెంకటస్వామికి స్థానిక వైసిపి నాయకులు మండల ప్రజా ప్రతినిధులు దుశ్యాలువ కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు. సోమవారం కుందుర్పి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్ఐకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి రాధాస్వామి, కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి, ఎంపీపీ, కమల నాగరాజు, గ్రామ సర్పంచ్, మారుతీశ్వర రామ్మూర్తి, మహంతపురం గ్రామ సర్పంచ్, మసాలా ,జగన్, మాజీ జెడ్పిటిసి రాజగోపాల్, ఈ సందర్భంగా మాట్లాడారు. నూతన ఎస్సై పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద ప్రజలకు వెంటనే న్యాయం చేయడంలో ఎస్సై పెద్దపీట వేసి, పనిచేస్తున్నారని గుర్తు చేశారు. తద్వారా ఆయన విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయడంతోనే జిల్లా ఉన్నతాధికారులు ఉత్తమ అవార్డు గ్రహీతకు ఎంపిక చేశారని తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ అవార్డులతోపాటు ప్రశంస పత్రాలు స్వీకరించాలని ఆకాంక్షించారు
previous post