రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు గతంలో విధించిన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. బైక్, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% డిస్కౌంట్ ప్రకటించిందని పెండింగ్ చాలన్ల వాహనదారులు చాలన్లు బకాయి చెల్లించాని సూచించారు
