టాక్స్ మేళా ద్వారా రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆశాభావం వ్యక్తం చేశారు.బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాక్స్ మేళా లో దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని కమీషనర్ పరిశీలించి, సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో టాక్స్ మేళా నిర్వహించడం జరుగుతుందని, నగరానికి చెందిన ప్రజలు టాక్స్ సంబంధమైన అంశాలు, టాక్స్ సవరణ, వి ఎల్ టి టాక్స్ నుండి ఇంటి నంబరు మార్చుకోవడం, ఇంటి పన్ను సవరణ,ఇంటి యజమాని పేరు మార్చుకోవడం,ఇంటి నంబర్ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చునని,అంతే కాకుండా ఆన్లైన్ సేవలు అన్ని సి డి ఎం ఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని, అట్టి సేవలు కుడా పొందవచ్చునని, పన్నుల సంబంధ అంశాలు పరిష్కారం కావడానికి ఇదొక్క చక్కని వేదికని, ఇట్టి సదవకాశాన్ని నగర పౌరులు వినియోగించుకోవాలని కోరారు. ఫిబ్రవరి-మార్చి మాసం రాబోతుందని, మునిసిపల్ చట్టం ప్రకారం జూన్ – డిసెంబర్ మధ్య కాలం లోనే పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, నల్లా పన్నులు,అస్తి పన్నులు,ట్రేడ్ లైసెన్స్ లు ఉన్న కమర్షియల్ షాపులు వెంటనే పన్నులు చెల్లించి బల్దియా కు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఈ సందర్భం గా కమీషనర్ ప్రజలను కోరారు. అనంతరం అదనపు కమీషనర్ మాట్లాడుతూ ఇట్టి మేళా యందు 13 మంది వివిధ రెవిన్యూ సంబంధ అంశాల పరిష్కారం పై దరఖాస్తులు అందజేశారని,అట్టి ఫిర్యాదు లను రెవెన్యూ సిబ్బంది కి అందజేసి వారం లోగా పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్, సూపరిండెంట్ ఆనంద్, ఐ టి మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

previous post