వరంగల్ జై భారత్ వాయిస్
టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలోఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వలుపదాసు చంద్రశేఖర్ కు ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ఎంజీఎం లో పనిచేస్తున్న ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, వరంగల్ సిటీ యూనిట్ కోశాధికారి శ్రీనివాస్, ఎంజీఎం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, రవీందర్, జిల్లా నాయకులు నాగేశ్వరరావు ,వంగ రవీందర్, అశోక్, శంకేసిరాజేష్, గణేష్,, నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రమీలావతి కార్యదర్శి తిరుమల దేవి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
