భాగ్యనగరం: జై భారత్ వాయిస్
ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ గోపాల ఇతిహాస్ అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో డాక్టర్ ఇతిహాస్ బుధవారం నాడు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడానికి యువత ముందుండాలని ఆయన యువతకు సూచించారు ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు