Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అభివృద్ధి పనులపై మండల సమావేశంలో సమీక్ష

కుందుర్పి జై భారత వాయిస్
కుందుర్పి మండలంలోగ్రామీణా ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అభివృద్ధి పనుల అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాపిగా సాగింది. గురువారం కుందుర్పి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కమలమ్మ నాగరాజు అధ్యక్షతన నిర్వహించారుఈ సమావేశంలో మండలంలోని గ్రామాలలో ప్రజలు ఎందుర్కొంటున్న విద్యుత్‌, ఉపాధి హామీ, నాడు -నేడు పనులు,విద్య కు సంబందించిన విషయాలు, , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచ్‌లు సమీక్ష నిర్వహించారు రానున్న వేసవికాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సర్వసభ్య సమావేశం దృష్టికి వివిధ గ్రామాల సర్పంచులు ,తీసుకువచ్చారు . మండలంలో, మండల కేంద్రంలో చిన్నారులకు, బాల్య వివాహల గురించి, అవగాహనా కార్యక్రమలు, చేయాలని, ఐసిడిఎస్ అధికారితో చర్చిచారు.వేసవి కాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై అధికారులను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి.గత మూడు సర్వ సభ్య సమావేశాలు నుంచి అధికారులకు సమస్యలు తమ ముందు పెట్టిన ఇప్పటివరకు పరిష్కరించలేదని అధికారులపై మండిపడ్డారు. కొంతమంది కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజర్‌ కావడంతో ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.

Related posts

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Jaibharath News