దామెర జై భారత్ వాయిస్
దామెర పోలీస్ స్టేషన్ పరిదిలోని కౌకొండ లో మేకల యుగేందర్ అనే వ్యక్తిని భూ తగాదా విషయంలో నేరస్థుడయిన మేకల సిద్దుకు అతనికి వరుసకు బాబాయి అయిన మేకల, యుగేందర్, అను వ్యక్తిని జనవరి 30 న తెల్లవారు జామున 01:20 గంట లకు కౌకొండ గ్రామ సెంటర్ లో గొడ్డలి తో నరికి చంపి తన వద్ద ఉన్న టూవీలర్ బండి పై పారిపోయి గొడ్డలిని రక్తం మరకలు ఉన్న డ్రెస్ ను వెల్లంపల్లి కెనాల్ ఏరియా పొదల్లో దాచి పారిపోయాడు. గురువారం నాడు పరకాల రూరల్ సీఐ మల్లేష్, దామెర ఎస్సై శ్రీ కొంక అశోక్ లు కంటాత్మ కూర్ సెంటర్ లో వాహనాలు తనీఖీ చేస్తుండగా నేరస్థుడు తను నేరానికి ఉపయోగించిన AP 36 AT 1532 నెంబర్ గల బండిని నడుపుతూ హన్మకొండ వైపు వెళ్తుండగా పట్టుబడినాడు. పంచుల సమక్షంలో నేరస్థుడిని పట్టుకొని, బండిని రక్తం మరకలు ఉన్న దుస్తులను గొడ్డలిని సీజ్ చేశామని నిందితుడిని కోర్టు లో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించినట్లు పరకాల ఏసిపి కిషోర్ కుమార్ తెలిపారు.
previous post