వరంగల్ జై భారత్ వాయిస్
ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న రామానుజియర్ సమత స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. వరంగల్ నగరంలో వికాస తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదండీ చిన్న జీయర్ స్వామి రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీ నుండి సికేఎం కళాశాల మైదానం వరకు సమతా దీక్షలో నగర సంకీర్తన నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి 27వ తేదీ వరకు మనందరం సమత యాత్ర సమత దీక్ష నిర్వహించతున్నామని, అందరూ దీక్షలో పాల్గొనాలని సమత దీక్షను విజయవంతం చేయాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.
