Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

(గీసుకొండ జై భారత్ వాయిస్ )
శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను పరిశీలించడం జరిగిందని పరకాల శాసన సభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట్, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను శనివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. యూనిట్ల వారిగా అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అధికారులు పరిశ్రమల నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను పరిశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆర్పాటంగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడేళ్లు గడిచిన పనులు మాత్రం నత్తనడకగా సాగాయని గత పాలకులు అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై చూపకపోవడం వల్ల ఎం ఓ యు చేసుకున్న కంపెనీలు సైతం పనులు పూర్తి చేయలేకపోయాయని అన్నారు.ఎం ఓ యు చేసుకున్న కంపెనీలు తమ యూనిట్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలని, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నట్లు వారు నా దృష్టికి తీసుకుని వచ్చారని ఉద్యోగ భద్రతతో పాటు తగిన వసతులు ఏర్పాటు చేయాలని వారి పని ఒత్తిడిని తగ్గించెలా యజమాన్యం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కంపెనీ నిర్వాహకులను కోరారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ ఎంపీపీ సౌజన్య టెక్స్టైల్ శాఖ అధికారులు పరిశ్రమల నిర్వహూకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

Sambasivarao