దామెర: జై భారత్ వాయిస్
దామెర మండలంలో ఆదివారం 163 వ నంబరు జాతీయ రహదారిపై దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై కొంక అశోక్ వాహన తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కనే వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఇప్పటికే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిందన్నారు. వాహనదారులు తమ ప్రయాణంలో రహదారులపై నిలుపవద్దన్నారు. జాతీయ రహదారి పక్కనే వాహనాల పార్కింగ్ కోసం ప్రదేశాలు ఏర్పాటు చేశామని, ఆ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుకొని విశ్రాంతి తీసుకోవచ్చని తెలిపారు. చిరు వ్యాపారులు జాతీయ రహదారికి దూరంగా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. జాతరకు వెళ్ళే భక్తులు పోలీసుల సూచనలకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని సాగిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణీకులకు ఏమైనా సమస్యలు ఏర్పడితే పోలీస్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 100 కు తెలియజేయాలని సూచించారు.