Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పురాతన శివాలయం నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి

దామెర: జై భారత్ వాయిస్
దామెర మండల కేంద్రం లోని పురాతన శివాలయం పునః ప్రతిష్ఠ నిర్మాణ ఈ సందర్భంగా ఆదివారం పురాతన శివాలయ నిర్మాణ పనులను గురిజాల శ్రీరాంరెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిడి శ్రీధర్రెడ్డి, రెడ్ క్రాస్ డైరెక్టర్, బిల్లా ఇన్ఫ్రా ఎండి బిల్లా రమణారెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోల్సాని అనిల్ రెడ్డి, ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంట కొమురయ్య, మేరుగు కుమారస్వామి, మిరాల రవి తదితరులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ఎంతో విశిష్ట నేపథ్యం కలిగిన పురాతన శివాలయం నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. అంతే కాకుండా తమ వంతుగా ఆర్ధిక సహకారం అందించి, మహా పుణ్య కార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు వేద పండితులు శివాలయ పునః ప్రతిష్ఠా పూజలు నిర్వహించనున్నారు.

Related posts

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News