జై భారత్ వాయిస్
వెల్వడం గ్రామంలో మహిళల ఉపాధిని స్వయంగా ప్రవాసభారతీయులు మదర్ థెరీసా ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీపద్మ (USA) సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాలలో మహిళలు స్వయంగా ఆర్థికంగా ఎదగడానికి తమవంతు సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని,ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆడవాళ్లు ఆత్మస్థైర్యంను కోల్పోకుండా ఓర్పుగా కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని శ్రీపద్మఅన్నారు. ఈ సందర్భంగా ఆమె వెల్వడం గ్రామంలో మహిళలకు ఇచ్చిన కట్టుమిషన్లులను ట్రస్ట్ అధ్యక్షురాలు కోయసుధతో ప్రతి ఇంటికి వెళ్లి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అడిగి తెలుసుకొన్నారు. ఈ మధ్యనే అకస్మాత్తుగా భర్తను కోల్పోయిన ఒక మహిళ తమ సహాయంతో కుట్టు పని ఉపాధిగా చేసుకోవటం తెలుసుకొని ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఆశజ్యోతి USA , తన వంతు సహాయసహకారాలు ట్రస్ట్ కి ఎప్పుడూ ఉంటాయని అన్నారు.ఈ సందర్భంగా మదర్ థెరీసా ట్రస్ట్ కార్యాలయం ను పరిశిలించారు..ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
