ఆత్మకూర్ జై భారత్ వాయిస్
ఫిబ్రవరిలో 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆత్మకూరు మండలం అగ్రంపాడు లో నిర్వహించబడే సమ్మక్క సారక్క జాతరకు విచ్చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఆలయ పూజారులు,అధికారులు ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లతోపాటు జాతరకు సంబంధించిన పోలీస్ బందోబస్తు పై పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీసు, ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మ వారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్ల పై దృష్టి సారించాల్సిందిగా పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆహ్వానించిన వారిలో ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ రవిరాజ్, ఆలయ అధికారి శేషగిరి, పూజారులు సాంబశివరావు, వెంకన్న, సారంగపాణి,భాస్కర్, విశ్వనాథ్, స్థానిక నాయకులు రమేష్, స్వామి పాల్గొన్నారు.