హన్మకొండ: జై భారత్ వాయిస్
బిఆర్ఎస్ పార్టీ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ భాస్కర్ తన రాజీనామా లేఖ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మెయిల్ ద్వారా పంపించినని ఒక ప్రకటనలో తెలిపారు ఇటివలే హన్మకొండ లో తన అనుచరులతో సమావేశం నిర్వహించారుబీఆర్ఎస్ 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం మా కుటుంబం చాలా త్యాగాలు చేసిందని, అయినా బాబాయ్ దగ్గర తమకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1998లో తన తండ్రి ప్రణయ్ బాస్కర్ మరణించిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరిందని, అయితే అమ్మ త్యాగం చేసి, వినయ్ భాస్కర్ కు అవకాశమవ్వాలని కోరిందన్నారు. 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని ఆ పార్టీ పెద్దలు చెప్పినా వినలేదని, తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పూర్తిస్థాయిలో పని చేశానని గుర్తు చేశారు. తన చుట్టూ ఉండే నలుగురైదుగురు వ్యక్తుల మాటలు నమ్మిన బాబయ్.. తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం నన్ను కలిసి వేసిందన్నారు. ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేనని వెల్లడించిన అభినవ్ భాస్కర్
previous post