Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

దామెర, జై భారత్ వాయిస్
హన్మకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సీనియర్ నాయకులు పలకల జనార్ధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెడ్డి ఆ సంఘం మండల అధ్యక్షుడు కేతిపెల్లి శ్రీధర్రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు 10వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా నాయకులు మన్నెం ఇంద్రారెడ్డి, పలకల శ్రీనివాస్ రెడ్డి, మన్నెం రఘుపతిరెడ్డి, పలకల సాంబశివరెడ్డి, మన్నెం ప్రకాశ్ రెడ్డి, వంచ రవీందర్ రెడ్డి, మన్నెం జైపాల్ రెడ్డి, కేతిపెల్లి రాజిరెడ్డి, గోగుల సమ్మిరెడ్డి, పలకల సుధాకర్ రెడ్డి, గోగుల రాజేందర్ రెడ్డి, మన్నెం తిరుపతిరెడ్డి, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, కేతిపెల్లి రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News

మత్తు పదార్థాలకు బానిస కావద్దు: రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత

Gangadhar

వడ్డీ పాలెం గ్రామంలో పింఛన్ పండుగ కార్యక్రమం

Gangadhar