Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి!

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ 285 జయంతి వేడుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలన కాలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విచ్ఛిన్నమవుతున్నాయి అన్న భావనతో సేవాలాల్ గ్రామ గ్రామాన తిరిగి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా గిరిజన ఆచార వ్యవహారాలను ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. సంత్ సేవాలాల్ బంజార చైతన్యానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అని కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య అనుమంతు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సహక రిజిస్టర్ సరళ దేవి, మాధవి, అధ్యాపకులు డాక్టర్ చందూలాల్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ నరేష్, డాక్టర్ హరికుమార్, పిఆర్ఓ ఆదిరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News

దామెర గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రంగాచారి

Jaibharath News

తెలంగాణ జాతిపితగా జయశంకర్ పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి