భాగ్యనగరం: జై భారత్ వాయిస్
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభయ హస్తం 6 గ్యారెంటీలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర స్థలం వరకు సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ (సంత్ స్వామి) సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా ఐ & పిఆర్ కమిషనర్ హన్మంత రావు ప్రత్యేక సంచికను, ఐ & పి ఆర్ జెడీలు జగన్, శ్రీనివాస్, డిడీలు మధుసూదన్, హష్మీ తదితరులు పోస్టర్ ను ఆవిష్కరించారు.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు తప్పకుండా సైకిల్ యాత్ర చేస్తున్నానని గౌరీశంకర్ వెల్లడించారు.
మానవత్వంతో ఆలోచించే ప్రజా ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీలను అమలు పరచడానికి పూనుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, జర్నలిస్టుల సహకారంతో తాను ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నానన్నారు. మేడారం సైకిల్ యాత్ర విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) తదితరులను కలిసి వివరించినట్లు గౌరీశంకర్ తెలిపారు. అదేవిధంగా ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ (సంత్ స్వామి) కోరారు.
previous post