కాణిపాకం: జై భారత్ వాయిస్)
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్దకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కళాకారులు పిల్లన గ్రోవులు.తాళం భజన.కోలాట చెక్కభజన కులుకు భజన నామ సంకీర్తన. భజనలతో అగరంపల్లి క్రాస్ నుంచి వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మాడవీధులలో ప్రదర్శన చేస్తూ స్వామివారికి కళా నైవేద్యం సమర్పించారు అనంతరం ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించగా. ఈ సమావేశానికి జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళి సభా అధ్యక్షత వహించగా. ముఖ్య అతిథులుగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి హాజరయ్యారు. విజయ శంకరస్వామి. మాట్లాడుతూ స్వామి వారి చెంత నిత్య భజనలను ప్రారంభించాలని నిత్య నామ సంకీర్తన జరపాలనే కళాకారుల మనోవాంఛను దేవస్థానం అధికారులు మన్నించి వెంటనే వేదికను ఏర్పాటు చేసి తగిన సౌకర్యం కల్పించాలని కోరారు జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ కళాకారులు కాణిపాక దేవస్థానంలో నిత్య భజనలకు వేదిక ఏర్పాటు చేయాలని కోరుతున్నా దేవస్థానం అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని. కళాకారుల కోరికలు మన్నించాలని తెలిపారు. జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ అన్ని దేవాలయాలలో నిరంతర నామ సంకీర్తనలు జరుగుతున్నా.. కాణిపాక దేవస్థానంలో భజనలు జరగకపోవడం బాధాకరమని గతంలో నిరంతరంగా కొనసాగుతున్నటువంటి కళా ప్రదర్శనలు ఆపివేసి మళ్లీ కొనసాగించకపోవడం సమంజసం కాదని తెలిపారు

కళాకారులకు నిత్య భజనలకు ఒక వేదిక కూచిపూడి, భరతనాట్యం, హరికథ, కోలాట, చెక్కభజన, పండరి భజన, పిల్లనగ్రోవులు.కులుకు భజన లాంటి కళాకారులకు మరో వేదిక ఏర్పాటు చేసి అవకాశాలు ఇవ్వాలని కోరారు. తదనంతరం ఆలయ ఏ ఈ ఓ మాధవ రెడ్డి మాట్లాడుతూ. కళాకారులు కోరినటువంటి ఈ విషయాలను చైర్మన్ కి ఈవో దృష్టికి తీసుకెళ్లి. చర్చించి త్వరలోనే భజనలు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకునేటట్లు అధికారులు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు కేఎస్ రామచంద్రన్ మాట్లాడుతూ. కళాకారుల పట్ల దేవస్థాన అధికారుల నిర్లక్ష్య ధోరణి తగదని స్వామివారి సేవలో పాల్గొని అందరం సమన్వయమై ఐకమత్యంగా స్వామివారి వైభవాన్ని నలుమూలలా చాటి చెప్పేటందులో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు…. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నాగరాజు చిత్తూరు జిల్లా కార్యదర్శి రవికుమార్ చిత్తూరు జిల్లా కోశాధికారి రాజేంద్ర నాయుడు . జిల్లా నాయకులు సునీతమ్మ. రాజేంద్ర . భువనేశ్వరమ్మ. సుందర్ రాజన్న . గురువులు మని విక్రమ్ . సుందరయ్య . నాగభూషణమ్మ . వరదరాజులు . జిల్లా వ్యాప్తంగా భజన బృందం లీడర్లు గురువులు కళాకారులు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు.