కుందుర్పి జై భారత్ వాయిస్
రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముకలు దాడి అమానుషమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 18-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం,మున్సిపాలిటీ లోని దొడగట్టు గ్రామంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రిక విలేకర్లకు స్వేచ్ఛ ఉంటుందని ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు అని ఆయన ఖండించారు. తప్పును ఎత్తి చూపే ఒక ఆంధ్రజ్యోతి విలేకరిపై సాక్షాత్తు సీఎం మాట్లాడుతున్న సమయంలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి ముకలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం అమానుషం అన్నారు. ఒడి పోతమన్నా భయంతోనే వైసీపీ రౌడీలు గుండాలు బరితెగించి ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడికి పాల్పడ్డారన్నారు . ప్రజాస్వామ్యంలో తప్పులను ఎత్తి చూపేవారిపై ఇలా బరితెగించి దాడులు పాల్పడం ఎంత వరకు సమాంజసం అని ఉమామహేశ్వర నాయుడు ఖండించారు. భవిష్యత్తులో వైసీపీ రాజ్యమేలుతే ఏవిదంగా ఉంటుందో మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రజాస్వామ్య వదులు, లౌకిక వదులు ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ పై దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు.