సమ్మక్క జాతర
విధుల్లో ఆలసత్వం వద్దు
-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ఆత్మకూరు మండలం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరలో విధులు నిర్వహణ లో వివిధ శాఖల అధికారులు ఆలస్వత్వం వీడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతరలో విధులు నిర్వహించే వివిధ శాఖల అధికారుల పనితీరును ఆమె పరిశీలించారు. పనులు ఎంతవరకు పూర్తి చేశారని విధులను ఎంతమంది ఏక్కడ నిర్వహిస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాత రను విజయ వంతం చేయాలని
ఆధికారులను కోరారు. .అనంతరం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు సేవలు అందించడంలో అధికారులు ముందు ఉండాలన్నారు. ఈ జాతరకి సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆయన అన్నారు. గత జాతరను దృష్టిలో ఉంచుకొని సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. జాతరలో అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులను నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్ జాతర చైర్మన్ శీలం రమేష్ ఏసిపి కిషోర్ కుమార్ ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.