Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతర లో గట్టి పోలీస్ బందో బస్తు

అగ్రంపహాడు జాతరలో పోలీస్ భారీ బందోబస్తు

-కమాండ్ కంట్రోల్ పరిశీలించిన డిసిపి రవీందర్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ తెలిపారు. గురువారం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను డిసిపి పరిశీలించారు. జాతరలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రతా దృష్ట్యా ప్రతి చెక్ పోస్ట్ వద్ద పోలీస్ గెస్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. నిరంతరం పోలీసులు డేగ కళ్ళతో దొంగ తనాలను అరికట్టేందుకు పహారా కాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ జాతరలో పరకాల ఏసీపీ కిషోర్ కుమార్, సిఐలు ఆర్ సంతోష్, డి రవికుమార్ ఎస్ఐలు, రాజేష్ రెడ్డి, ప్రసాద్, పోలీస్ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు.

Related posts

ఎల్కతుర్తి మండల కేంద్రం అభివృద్ధి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు

వివాహానికి ఆర్థిక సహాయం

Jaibharath News