Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

మేడారం జై భారత్ వాయిస్

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడాలని సుఖశాంతులతో రాష్ట్ర ప్రజలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని ఆయన తెలిపారు సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం ఏర్పడదని ఆయన అన్నారు తాను ఇక్కడ నుంచే హత్ సే హాత్ జోడోయాత్ర ఇక్కడ నుంచే చేపట్టానని ఆ రోజే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమ్మల ఆశీర్వాదంతోనే ప్రభుత్వం వచ్చిందని నేను ముఖ్యమంత్రి అయ్యాను సీతక్క మంత్రి అయిందని ఆయన అన్నారు ఈరోజు కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో లోపం ఉండకుండా ప్రభుత్వం 110 కోట్ల రూపాయలు నిధులను కేటాయించి అహర్నిశలు అభివృద్ధి పనులు చేపట్టిందని అన్నారు. మంత్రుల బృందంతో పేద ప్రజలకు ఇబ్బందులు ఉండకుండా అహర్నిశలు కృషి చేశారని మా ఆడబిడ్డలకు జాతరను సందర్శించుకునేందుకు ఉచితంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు అదనంగా వంధ కొత్త బస్సులను జాతరకు వినియోగించడం జరిగిందని అన్నారు సమ్మక్క సారక్క పోరాట ప్రతిమతో పోరాడారని ఆనాడు అమరులైన ఈనాటి దేవతలుగా ప్రజలు కొలుస్తున్నారు అని అన్నారు
సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో మమ్మల్ని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో రెండు గ్యారెంటీలను ఈనెల 27 నుంచి ప్రారంభం చేనున్నట్లు తెలిపారు

పేదవారికి ప్రతి ఇంటికి 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు నిరుపేదలకు 2 యూనిట్లు ఉచిత కరెంటును అందించనున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు అందియనున్నట్లు తెలిపారు 10 ఐటిఐ లను స్కిల్ యూనివర్సిటీగా మార్చినట్లు తెలిపారు వారికి విద్య ఉద్యోగ ఉపాధి కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికలు చేపిస్తున్నట్లు తెలిపారు

కాలేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ మేడిపండుగా మారింది
కాలేశ్వరం ప్రాజెక్టు అవనితిలో కొట్టుకపోయిందని మేడిగడ్డ మేడిపండులా మారిపోయిందని ఆన్నారు 60 సంవత్సరాల లో జరిగిన అవినీతి పది సంవత్సరాల్లో అవినీతిగా నాటి బిఆర్ఎస్ నాయకులు మార్చారని అన్నారు బిజెపి నాయకులు కెసిఆర్ పై అవినీతి విచారణకు సీబీఐకి ఇవ్వడం అంటున్నారని కానీ జ్యుడీషియల్ ఎంక్వైరీ బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కోవాలని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా మాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాను రైతులకు శుభవార్త అందించనున్నట్లు తెలిపారు గతంలో అధికారులకు నగదుఇస్తేనే పోస్టింగులు వేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగాల బదిలీ జరుగుతున్నాయని అన్నారు ఉద్యోగులకు న్యాయం జరిగిందని అన్నారు ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో ఆనాటి ప్రభుత్వ హయాంలో తెలియదని నెల మొదటి వారంలో జీతాలు రాలేదని కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల ఒకటి రెండు తారీకు లోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం అందిస్తున్నామని అన్నారు పరిపాలన అందిస్తున్నామని సెలవులు తీసుకోకుండా ప్రజాసేవలో అందిస్తున్నామన్నారు సచివాలయంలో ఎవరికి ఎలాంటి అనుమతి లేవని మీడియా మిత్రులు కూడా బయట నుంచి చూసేవారు అని కానీ ఇయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది ఉందని సచివాలయంలో అందరూ సందర్శిస్తున్నారని అన్నారు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే పేదల ప్రభుత్వం వచ్చిందని పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఆరు గారెంటీలను అమలు చేస్తామని అన్నారు జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాకుండా జాతర ఎప్పుడు అభివృద్ధి జరిగేందుకు నిరంతరం అభివృద్ధి జరగాలని నిధులు అందుకు కేటాయిస్తామని అన్నారని మీడియా మిత్రులకు కూడా పది సంవత్సరాలు మోసం జరిగిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అతి త్వరలోనే నియమించబోతున్నాము వారి ద్వారా చర్చలు జరిపి మీడియా మిత్రుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు మేము వచ్చి 100 రోజులు కాలేదు మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. జాతర తర్వాత మంత్రులతో ఒక కమిటీ వేసి జాతర అభివృద్ధి కోసం కమిటీ గిరిజనుల సంఘాల ఆదివాస సంఘాల ప్రజల అభ్యర్థన మేరకు గిరిజన సాంప్రదాయం ప్రకారము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు గిరిజన సాంప్రదాయానికి ఎలాంటి భంగం కలగకుండా శాశ్వతమైన అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన హామీ ఇచ్చారు

Related posts

ములుగులో నాడు ఎన్ కౌంటర్లు నేడు ప్రశాంతవాతావరణం

Jaibharath News

బతుకమ్మ సంబరాల్లో సీతక్క

Jaibharath News

సీతక్క చే గణిత పుస్తక ఆవిష్కరణ

Jaibharath News