అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఐయురారోగ్యాలతో సిరిసంపదలతో ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అమ్మవార్లను వేడుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దంపతులు అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత జాతరల కంటే ఈసారి జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించామని భక్తులకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాతరకు రెండు నెలల ముందు నుండి జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేశామని చెప్పారు. భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పడ్డాయని దీంతో భక్తులు శీఘ్రంగా అమ్మవాలను దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తో పాటు జాతర చైర్మన్ శీలం రమేష్, మాజీ చైర్మన్ బోరిగం స్వామి, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్యలక్ష్మి రవి, జాతర డైరెక్టర్లు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.