Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

జై భారత్ వాయిస్ ఆత్మకూరు:
అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ లు జనంలో మూడు రోజు ల పాటు పూజలు అందుకొని జనము నుండి వనంలోకి వెళ్లారు. దీంతో జాతర మహా ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పూజారులు బలిహరణ చేసి అమ్మవార్లను గద్దల నుండి తరలించారు. హుండీలను కదిలించి జాతరను ముగింపు పలికారు. ఈ సందర్భంగా జాతర ప్రత్యేక అధికారిఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వన ప్రవేశం ఘనంగా నిర్వహించారు. శనివారం జాతరలో భక్తుల తాకిడి జోరుగా సాగింది. అమ్మవారిని దర్శించిన పూనేందుకు భక్తులలు క్యూలైన్లలో బారులు తీరారు దీంతోజాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జాతర సజావుగా భక్తులకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఈవో శేషగిరిరావు ఏసిపి కిషోర్ కుమార్ సిఐ సంతోష్ లో మాజీ పిఎస్పీఎస్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి, జాతర చైర్మన్ శీలం రమేష్ మాజీ ఏఎంసీ చైర్మన్ బోరి గo స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్ జాతర డైరెక్టర్లు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు.

Related posts

రైతులతో ముచ్చటించిన ఎస్సై అశోక్

Jaibharath News

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఆత్మకూరు -సిఐ క్రాంతి కుమార్

Jaibharath News

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు