జై భారత్ వాయిస్: హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సైన్స్ డే కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్ఐటి ఫిజిక్స్ విభాగం ఆచార్యులు డాక్టర్. దినకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందని భారతదేశంలో మొట్టమొదటి నోబుల్ ప్రైజ్ గ్రహీత సివి రామన్ జయంతి రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం 1986 నుండి మొదలైందని ఆయన అన్నారు. దేశ పురోగతికి శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని నేడు సైన్స్ లేనిదే ఏ పని జరగడం లేదని ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పదానికి దోహదపడే విధంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బన్న ఐలయ్య మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నేడు ప్రతి రంగాన్ని శాసిస్తుందని, సైన్స్ నిజనిర్ధారణకు దోహదపడుతుందని అయితే నేడు సైన్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అనర్ధాలకు కూడా ఉపయోగిస్తున్నారని సైన్స్ ఇటు మంచికి చెడుకు ఉపయోగపడుతుందని కానీ మంచికే సైన్సును వాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, డాక్టర్ రాజు , కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ ఆదిరెడ్డి అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
previous post