జై భారత వాయిస్, కుందుర్పి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. మహిళలు ఉద్యోగాల్లో కూడా పురుషులతో సమానంగా రానించాలన్నారు. మహిళలు చదువే ఆ ఇంటి తో పాటు ప్రపంచం అంతా వెలుగు నిండుతుందన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ఏటా నిర్వహిస్తోందన్నారు.దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయన్నారు. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారని గుర్తు చేశారు.ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు.ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళదన్నారు.కోపెన్‌హెగెన్ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్’ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారన్నారు.కార్యక్రమంలో RDT ATL నారాయణస్వామి ,ICDS సూపెరవైజర్ లక్ష్మిదేవి, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
next post