మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ భక్తులకు అన్నదానం కార్యక్రమానికి బియ్యం బస్తాల పంపిణీ,,
జై భారత వాయిస్, కుందుర్పి
పారిశ్రమికవేత్త బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధికి వంద బస్తాల బియ్యం వితరణ…
కళ్యాణదుర్గం నియోజకవర్గం బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సన్నిధికి వంద బస్తాల బియ్యన్ని జీకే యువ సేనా సభ్యుల ద్వారా పంపించారు. ఈరోజు గురువారం స్థానిక శ్రీ అక్కమ్మ అమ్మవారి దేవాలయం నుండి వంద బస్తాల బియ్యం వాహనాన్ని జీ కే యువ సేనా సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. మహా శివరాత్రి సందర్బంగా శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం అన్నదానం కోసం బియ్యన్ని పంపిస్తున్నట్లు జీకే కృష్ణమూర్తి తెలిపారు.దాదాపు 5సంవత్సరాలనుండి వంద బస్తాల బియ్యం ను ఆలయంనకు పంపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీకే యువ సేనా సభ్యులు కొత్తూరు వీరేష్, బాబ్జి, రమేష్, పాతలింగ తదితరులు ఉన్నారు.