ఘనంగా నాగూర్ల జన్మదిన వేడుకలు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ రైతు విమోచన సమితి కమిషన్, చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఆత్మకూరు మండలం గూడప్పాడ్ సెంటర్లో తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎండి బాబు మియా (చిరు ) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలను పండ్లను వృద్ధులకు పిల్లలకు పంపిణీ చేశారు. బాణాసంచాలు కాలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మియా మాట్లాడుతూ మాజీ రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగూర్ల వెంక టేశ్వర్ రావు రైతులకు ఉద్యమకారులకు చేసిన మంచి సేవలు అందించారని అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారులను ఒక తాటి పైకి చేర్చిన ఘనత నాగూర్లకి దక్కిందన్నారు. ఉద్యమకారుల సంఘం నాయకులు
అంకతి రవి( ఎర్రన్న) తోట గణపతి, వంగేటి ప్రభాకర్ , బుస్స
రవికుమార్,లక్ష్మణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post