తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన DSC(SGT) పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణా రాష్ట్ర బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న (12) జిల్లాల స్టడీ సర్కిళ్ళలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఈనెల 22వ తేదీ లోగా తమ దరఖాస్థులను www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని ఆయన తెలిపారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్.జి.టి. సంబంధించి ఇంటర్మీడియట్, డైట్, టెట్ లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్. నెం.0870-2571192, 040-24071178, 040-27077929 ద్వారా సంప్రదించాలని డి. శ్రీనివాస్ రెడ్డి కోరారు.