జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 17 నుంచి 31 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి శనివారం నాడు రాత్రి 8 గంటలకు ఆహ్వానం పత్రాన్ని దేవాలయ అర్చకులు రామాచార్యులు అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈఓ జి.శేషగిరి, అర్చకులు రామాచార్యులు, విష్ణు ఆచార్యులు సచివాలయంలో మంత్రి ని కలిసి ఆహ్వానించారు. వేదమంత్రాల నడుమ మంత్రికి స్వామి వారి శేష వస్త్రాలు సమర్పించి, ఆశీర్వచనమిచ్చారు.
previous post