జై భారత్ వాయిస్ గీసుకొండ
అతిధి జాతీయ మాసపత్రిక దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు, అందులో భాగంగా వివిధ రంగాలలో విశేషమైన సేవలు అందిస్తున్న వారికి ప్రత్యేకంగా ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు.
వైద్యరంగంలో విశేషమైన సేవలందిస్తున్న నిమ్స్ లైజన్ ఆఫీసర్, ఆహా అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్త రమేష్ కి ముఖ్యఅతిథి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఎక్సలెన్సి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అతిథులు డాక్టర్ రమేష్ సేవలను కొనియాడుతూ వృత్తిని సేవగా భావిస్తూ, అంకిత భావంతో పనిచేస్తూ, అహర్నిశలు పేదల బాగుకొరకు పరితపిస్తారని, వారు ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఎంతో మంది ఉద్యమ కారులను కంటి రెప్ప వలె కాపాడాడని, నిమ్స్ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వెళ్లే వరకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ ఈ అవార్డు నాకు ఇచ్చి నా భాద్యతను మరింత పెంచిన అతిథి జాతీయ మాస పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు, అదే విధంగా తను ఏ పని చేసినా ప్రోత్సహించే సహచర నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బందికి, తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులకు, ఆహ కమిటీ నాయకులకు ఋణపడి ఉంటానని, ఈ అవార్డు సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని అన్నారు.
previous post
next post