జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గం 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్ ఆధ్వర్యంలో లెనిన్ నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 100మంది బిఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలుఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంప్ కార్యాలయంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే విశ్వ గురువుగా పేరుపొందినటువంటి మోడీ ఆధ్వర్యంలో పనిచేయడం మనకు దొరికిన అదృష్టం. రాబోయే లోక్ సభ ఎన్నికలలో మన వరంగల్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీ రావాలని కోరారు.పార్టీలో చేరిన వారిలో తంగేలపల్లి శివ, రవితేజ, యాకయ్య, సన్నీ, సాయి తేజ, సంతోష్, సమ్మయ్య, యశ్వంత్, విజయలక్ష్మి, కోమల, మంజుల, ఉపేంద్ర, శ్రీలక్ష్మి చేరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బక్కి రంజిత్, చాపల నాగరాజు, టింకు, తదితరులు పాల్గొన్నారు.
next post