Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

స్టాటిస్టికల్ సర్వేలెన్సు చెక్ పోస్ట్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ

జై భారత్ వాయిస్ హనుమకొండ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా ములుగు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాటిస్టికల్ సర్వేలెన్సు టీం (ఎస్.ఎస్.టి ) చెక్ పోస్ట్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం తనిఖీ చేశారు.ఎస్ ఎస్ టి చెక్ పోస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీలను గురించిన వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్ ఎస్ టి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా చెక్ పోస్ట్ కు నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.

Related posts

ఆర్ట్స్ కళాశాలలో వివేకానందుని జయంతి వేడుక!

చాకలి ఐలమ్మ 129‌వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మేయర్ ఎమ్మెల్యేలు ఎంపీ

Sambasivarao

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

Jaibharath News