జై భారత్ వాయిస్ అనంతపురం
సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు-2024 పురస్కరించుకుని బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లాలో మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు స్ధానిక పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలోకి పట్టణాలలోకి ప్రవేశించే మార్గాల్లో చెకింగులు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడపట్టారు. అంతేకాకుండా… రహదారులు, ప్రధాన కూడళ్లలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు… ఇలా ఏ వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరత్రా సొత్తులపై నిఘా వేశారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు
previous post