జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండలం ఎంపిపి కందకట్ల కళావతి నరహరిపై మండల ఎంపిటిసిలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని వరంగల్ ఆర్డీఓ దత్తుకు శుక్రవారం అందచేసినట్లు సంగెం జడ్పీటిసి సుదర్శన్ రెడ్డి తెలిపారు.బి.ఆర్.ఎస్.పార్టీలో కొనసాగుతూ,పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్న తరుణంలో ఎంపిపి పై అవిశ్వాస తీర్మానం చేయడం జరిగిందని ఎంపిటిసిలు తెలిపారు.బి.ఆర్.ఎస్.పార్టీ అవకాశం కల్పిస్తే ఎంపిపి అయిన మీరు ఆ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పార్టీలో ఉంటూ పార్టీ కి ద్రోహం చేయాలని చూసేవారిని సహించేదిలేదని వారు తెలిపారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటే కొనసాగుతామని తెలిపారు.మండలంలోని బి.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు ఎవరు ఇలాంటి నమ్మక ద్రోహుల మాటలువిని మోసపోవద్దని,పార్టీ మారవద్ద ని కోరారు.
ఆర్డీఓని కలిసిన వారిలో జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి, వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య, ఎంపిటిసిలు గుగులోతు వీరమ్మ,,రంగరాజు నరసింహస్వామి,సుతారి బాలకృష్ణ,మెట్టుపల్లి మల్లయ్య,అడ్డగట్ల దుర్గారావు,కట్ల సుమలత,గాయపు ప్రచూర్ణ,కొనకటి రాణి,గుగులోతు పద్మ,బొమ్మ పావని,కో ఆప్షన్ మన్సూర్ అలీ తదితరులు ఉన్నారు.

previous post