Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నీటి సమస్య రాకుండా చూడాలి – ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా

భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
_ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
భవిష్యత్తు లో నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ప్రతి చోట ఇంకుడు గుంతలు తప్పకుండా నిర్మించాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ముందుగా పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో పాటు డిఆర్డిఏ అధికారి నాగ పద్మజ పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల్లోని ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. అలాగే ఉపాధి హామీ పథకంలోని రికార్డులను సాఫ్ట్ వేర్ ను పరిశీలించి ఏపీఓ రాజిరెడ్డి కి తగిన సూచనలు చేశారు. ఇంకా స్వర్ణ భారతి మండల సమైక్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రైని కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లోని వర్షం నీరు ఇండ్లలోని మురికి నీరు ప్రతి ఒక్క బొట్టు కచ్చితంగా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు నీటి నిల్వలు పెంచే విధంగా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు డ్రైనేజ్ చివర లో ఇంకుడు గుంతలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఏపీవో రాజిరెడ్డి, ఏటీఎం లలిత, ఈసీ రాము టి ఏ లు సురేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

యూనివర్సిటీ న్యాయకళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల ప్రిన్సిపల్ బి.ఓ.ఎస్ డీన్ లు రాజీనామా చేయాలి

కేంద్ర బలగాల తో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Jaibharath News

కలెక్టర్ కు రాఖి కట్టిన బాలికలు