బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకంగా తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు కడియం కావ్య ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాసింది.

వరంగల్ పార్లమెంటు నుంచి మొదటి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంపై బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. మొదటి నుంచి వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆరూరి రమేష్ ఎంపీగా పోటీ చేస్తామని అనుకోవడంతో పార్టీ అధిష్టానం మొదట ఓకే అని చెప్పింది. తర్వాత క్రమంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ ఆయన కూడా ఓకే అని చెప్పి చివరి క్షణంలో ఒక దశలో ఆరూరి రమేష్ అని సూచించినారు. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాదని గ్రహించి తన దారి తాను వెళ్లిపోతానని బిజెపి నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన బిజెపిలో చేరుతామని తన అనుచరులను సిద్ధం చేసుకోవడంతో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం హుటాహుటిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పార్టీ సీనియర్ నాయకులు నాగూర్ల వెంకటేశ్వరరావు ఆరూరి రమేష్ ఇంటికి వచ్చి హైడ్రామా వద్ద ఆయనను కార్లలో బలవంతంగా తీసుకొని హైదరాబాదుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు మా పార్టీలో చేరే రమేష్ ను మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని ఆ పార్టీ జిల్లా నేతల ఆరోపించారు సినీ పక్కిలో జనగామ జిల్లా కేంద్రంలో ఏకంగా బీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్తున్న కారు నుంచి ఆయననుదించి బిజెపి నాయకులు కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారు అయినా బీఆర్ఎస్ నాయకుడు రమేష్ పార్టీ మీటింగ్ వెళుతున్నానని చెప్పి హైదరాబాద్ తరలి వెళ్లారు.
ఏకంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు తాను వరంగల్ పార్లమెంటు నుంచి పోటీ చేయలేనని తెగేసి చెప్పేశారు. బీఆర్ఎస్ పార్టీ ముందే ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్న పార్టీ అభ్యర్థి కడియం కావ్య వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తమకు సీటు రావడం లేదని తెలుసుకొని ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ సైతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనను వరంగల్ లోకసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ముందే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఎన్నికలలో బరిలో నిలవనున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య పేరు ప్రకటించగానే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ స్థానానికి పోటీ చేసే కొంతమంది నేతలు తాము ఆమెకు మద్దతు ఇచ్చేది లేదంటూ పార్టీ అధిష్టానం సంకేతాలు పంపారుఆ తర్వాత రాజకీయ సమీకరణాల వల్ల ప్రస్తుత స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ నాయకులు కడెన్సియరీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో సమన్వయ సమావేశాలు నిర్వహించారు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు కష్టమని భావించి ముందు వస్తగానే పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు.