ఉపాధి హామీ పనుల పురోగతిపై అధి కారుల సమీక్ష
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ మాసం నుండి రోజువారీ కూలి వేతనాన్ని 272 నుండి 300 కు పెంచినందున ప్రతి గ్రామం నుండి ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలి ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కార్యదర్శులకు ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు ముఖ్యంగా పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీటి సౌకర్యం. నీడ పందిళ్ల ఏర్పాటు మెడికల్ హిట్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి ఎండ వేడి దృష్ట్యా ఉదయం 12 గంటలలోపే పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనికోరారు.కూలీల వసతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఆత్మకూర్ సిఐ వి. క్రాంతి కుమార్ మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, ఏపీవో రాజిరెడ్డి ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.