జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి జడ్పిటిసి కల్పనా కృష్ణమూర్తి గ్రామ పెద్దలు హాజరై తమ రాశి ఫలాల వివరాలను పండితులను అడిగి తెలుసుకున్నారు. దామెర మండల వ్యాప్తంగా ఉదయం నుంచి ఉగాది పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి వాతావరణం నెలకొంది.